కేవలం మీ ఓటుపైన మాత్రమే ప్రేమ

కేవలం మీ ఓటుపైన మాత్రమే ప్రేమ

తెలంగాణ కాంగ్రెస్ మహిళా నేత విజయశాంతి బుధవారం పెద్దపల్లిలో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ పై నిప్పులు చెరిగారు. కేసీఆర్ తెలంగాణ ప్రజలను బానిసలుగా చూస్తున్నారని ఆరోపించారు. అతనిపై మీకు ప్రేమ ఉంది కాని మీపై అతనికి ప్రేమలేదని అన్నారు. కేవలం మీ ఓటుపైన మాత్రమే ప్రేమ అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్, బీజేపీకి మధ్య దేశానికి సంబంధించిన ఎన్నికలు జరుగుతుంటే కేసీఆర్ మధ్యలో వచ్చారని ఆరోపించారు. మోడీ గెలుపు కోసం కేసీఆర్ పాటు పడుతున్నారని విమర్శించారు. 

'కేసీఆర్, మోడీ ఇద్దరు ఒక్కటే. జగన్, కేసీఆర్, మోడీ త్రిమూర్తులు. దేశంలో మోడీ.. రాష్ట్రాల్లో వీళ్ళు ప్రజలను దోచుకుంటున్నారు. 2 వేల పెన్షన్ కోసం కేసీఆర్ ను సీఎం చేశారు. తెలంగాణ ఇచ్చిన యూపీఏ చైర్ పర్సన్ సోనియా తల్లి రుణం తీర్చుకోవాలంటే రాహుల్ ని ప్రధానిని చెయ్యాలి' అని విజయశాంతి తెలిపారు.