విజయశాంతి కొత్తమాట... సెకండ్ ఇన్నింగ్స్ లో అధికారం.. 

విజయశాంతి కొత్తమాట... సెకండ్ ఇన్నింగ్స్ లో అధికారం.. 

13 సంవత్సరాల విరామం తరువాత విజయశాంతి తిరిగి సినిమా రంగంలోకి అడుగుపెట్టింది.  మహేష్ బాబు హీరోగా చేస్తున్న సరిలేరు నీకెవ్వరూ సినిమాలో ప్రొఫెసర్ భారతి పాత్రను చేస్తోంది.  ఈ పాత్రకు సంబంధించిన లుక్ ఇటీవలే రిలీజ్ అయ్యింది.  కాగా, సినిమా రంగంనుంచి తప్పుకున్నాక విజయశాంతి రాజకీయాల్లోకి వెళ్లిన సంగతి తెలిసిందే.  1998లో తెలంగాణ ఉద్యమంలో పాల్గొంది. రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తులు డబ్బు పేరు పవర్ కోసం ప్రయత్నం చేస్తారని, తన లక్ష్యం అది కాదని విజయశాంతి చెప్పింది.  

ఉద్యమం విజయవంతం కావాలని కోరుకున్నానని, అది విజయవంతం అయ్యిందని చెప్పింది.  ఇక అధికారం విషయానికి వస్తే అది సెకండ్ ఇన్నింగ్స్ లో సాధ్యం అవుతుందని చెప్పింది.  సెకండ్ ఇన్నింగ్స్ లో అంటే ప్రస్తుతానికి రాజకీయాలకు గ్యాప్ ఇచ్చిందా లేదంటే మరేదైనా అర్ధం ఉన్నదా.. సరిలేరు నీకెవ్వరూ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతున్నది.  వచ్చే ఏడాది జనవరి 12 వ తేదీన సంక్రాంతి కానుకగా సినిమా రిలీజ్ కాబోతున్నది.