మహేష్.. విజయశాంతిలు అలా కలుస్తారట..!!

మహేష్.. విజయశాంతిలు అలా కలుస్తారట..!!

మహేష్ బాబు కొత్త సినిమా సరిలేరు నీకెవ్వరూ షూటింగ్ హైదరాబాద్లో జరుగుతున్నది.  అన్నపూర్ణ సెట్స్ లో ట్రైన్ ఎపిసోడ్ ను షూట్ చేస్తున్నారు.  ఇందులో విజయశాంతి ఓ కీలక రోల్ ప్లే చేస్తున్నది.  ఈ సినిమాలో విజయశాంతి రోల్ కు సంబంధించిన ఓ కీలక సమాచారం ఒకటి బయటకు వచ్చింది.  

 

విజయశాంతి రాయలసీమ నుంచి హైదరాబాద్ వచ్చి సిటీలో సెటిల్ అవుతుందని, కాశ్మీర్లో ఆర్మీ లో ఉన్న మహేష్ బాబు హైదరాబాద్ వచ్చిన తరువాత మహేష్ కు కీలక విషయాలు చెప్పి రాయలసీమ పంపుతుందని.. ఆ తరువాత సీమకు విజయశాంతి వెళ్తుందని వార్తలు వినిపిస్తున్నాయి.  విజయశాంతి సీమ నుంచి హైదరాబాద్ కు ఎందుకు వస్తుంది.  మహేష్ ను ఆర్మీలో ఎందుకు జాయిన్ చేస్తుంది. మహేష్ హైదరాబాద్ వచ్చిన తరువాత విజయశాంతి .. మహేష్ ను సీమకు ఎందుకు పంపుతుంది అన్నది సినిమా కథ అని వార్తలు వస్తున్నాయి.  ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉన్నది అన్నది తెలియాలి.  రష్మిక మందన్న హీరోయిన్ గా చేస్తున్న ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు.  వచ్చే సంక్రాంతికి సినిమా రిలీజ్ కాబోతున్నది.