13 ఏళ్ల తర్వాత విజయశాంతి రీఎంట్రీ !

13 ఏళ్ల తర్వాత విజయశాంతి రీఎంట్రీ !

 

ఒకప్పటి స్టార్ నటి విజయశాంతి సినిమాలకు గుడ్ బై చెప్పి చాలా కాలమైంది.  ఇన్నాళ్లు రాజకీయాల్లో బిజీగా ఉన్న ఆమె దాదాపు 13 ఏళ్ల తరవాత మహేష్ నూతన చిత్రం 'సరిలేరు నీకెవ్వరు' తో రీఎంట్రీ ఇస్తున్నారు.  ఇక్కడ విశేషమేమిటంటే విజయశాంతి తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది సూపర్ స్టార్ కృష్ణ చేసిన 'కిలాడి కృష్ణ' సినిమాతో.  ఆ తరవాత 180 సినిమాలు చేసిన ఆమె మళ్ళీ ఇప్పుడు కృష్ణ కుమారుడు మహేష్ సినిమాతో రీఎంట్రీ ఇవ్వనున్నారు.  ఇకపోతే ఈ చిత్రంలో జగపతిబాబు కూడా ఒక కీలక పాత్ర చేయనున్నారు.