మహేష్ సినిమాకు ఆమె విలన్ కాదు

మహేష్ సినిమాకు ఆమె విలన్ కాదు

సూపర్ స్టార్ మహేష్ కొత్త చిత్రం 'సరిలేరు నీకెవ్వరు'లో సీనియర్ నటి విజయశాంతి ఒక ముఖ్యమైన పాత్ర చేయనున్నారు.  ఈ పాత్రకు ఆమెను ఒప్పించడానికి అనిల్ రావిపూడి చాలానే  కష్టమోదరు. నిర్మతలు సైతం ఎక్కువ మొత్తమే చెల్లించి ఆమె డేట్స్ తీసుకున్నారు.  ఇంతలా వారు ఆ పాత్రకు ఆమే కావాలని పట్టుబట్టి తీసుకోవడంతో సినిమాలో ఆమే విలన్ అనే ప్రచారం జరిగింది.  కానీ విజయశాంతి మాత్రం తనది విలన్ రోల్  కాదని, అసలు అలాంటి నెగెటివ్ రోల్స్ తాను చేయనని అన్నారు.  అలాగే తన పాత్ర మహేష్ పాత్రతో పాటే సమానంగా నడుస్తుంటుందని అన్నారు.  దీన్నిబట్టి సినిమాలో ఆమెది హీరోకి సహాయపడే పాత్రని స్పష్టంగా తెలుస్తోంది.