ఇవాళ్టి సభలోనే కేసీఆర్‌ను చూస్కోండి... మళ్లీ ఎప్పుడు కనిపిస్తారో?

ఇవాళ్టి సభలోనే కేసీఆర్‌ను చూస్కోండి... మళ్లీ ఎప్పుడు కనిపిస్తారో?

గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికలు సార్వత్రిక ఎన్నికలను తలపిస్తున్నాయి. రోజు రోజుకు అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం పెరుగుతోంది. ముఖ్యంగా బీజేపీ, టీఆర్‌ఎస్‌ల మధ్య ఈ వార్‌ ఎక్కువగా నడుస్తోంది. బీజేపీ ఎత్తుగడలకు చెక్‌ పెట్టేందుకు ఇవాళ బహిరంగ సమావేశం నిర్వహించనుంది టీఆర్‌ఎస్‌ పార్టీ. ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్‌ ప్రశంగించనున్నారు. అయితే.. తాజాగా విజయశాంతి ఈ సభపై సెటైర్‌ వేసింది.   "జీహెచ్ఎంసీ ప్రజలకు, తెలంగాణ ప్రజలకు సవినయ మనవి... ఇవాళ్టి కేసీఆర్ గారి ఎన్నికల ప్రచార బహిరంగ సభ నుంచి మన రాష్ట్ర ముఖ్యమంత్రి దొరగారిని ఒక్కసారి చూసుకోండి. మళ్లీ ఇంక ఇప్పట్లో ఎన్నికలు లేకుంటే వారు కనబడేది, వినబడేది అసాధ్యం. ప్రజలు ఇప్పుడున్న కష్టాలకు సీఎం గారి కామెడీ వాగ్దానాల ద్వారా ఏదో కొంత రిలీఫ్ లభించే అవకాశం ఉండవచ్చు. హామీల అమలు ఎప్పటిలాగే ఏమీ ఉండదని మనందరికీ ఎప్పుడూ తెలిసిన కార్యక్రమమే." అంటూ విజయశాంతి ఎద్దేవా చేశారు.