మూసీ నీరు, కేసీఆర్ మాటలు ఒక్కటే : విజయశాంతి

మూసీ నీరు, కేసీఆర్ మాటలు ఒక్కటే : విజయశాంతి

తెలంగాణ బిడ్డగా ఈరోజు నాకు కడుపు మండుతుందని...టీఆర్ఎస్ తో ప్రజలకు ఏమి లాభం లేదని విజయశాంతి అన్నారు. మూసీ నీరు, కేసీఆర్ మాటలు ఒక్కటేనని.... కేసీఆర్ కుటుంబం మొత్తం తెలంగాణ ను దోచుకుంటున్నారని ఫైర్‌ అయ్యారు.  ముఖ్యమంత్రి తెలంగాణ ప్రజలను కలిసే పరిస్థితి లేదని... బీజేపీ అధికారంలోకి వస్తేనే  ప్రజలకు లాభం కలుగుతుందన్నారు. కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు రెండు ఒక్కటేనని... సమస్యలు పరిష్కారం కావాలంటే బీజేపీ అధికారంలోకి రావాలని తెలిపారు. కేసీఆర్ మోసం చేసిన ప్రతి సమస్య మీద యావత్తు తెలంగాణ ప్రజలు పోరాడాలని... రాబోయే బై ఎలక్షన్ లో  బీజేపీ కార్యకర్తలు బాగా కష్టపడాల్సిన అవసరం  ఉందని పేర్కొన్నారు. మార్పు రావాలంటే  బీజేపీ తోనే సాధ్యమని...రోజు రోజుకి బీజేపీ  ఒక శక్తివంతమైన పార్టీగా ఎదుగుతుందని తెలిపారు.