బీజేపీలోకి విజయశాంతి... ముహూర్తం ఖరారు... 

బీజేపీలోకి విజయశాంతి... ముహూర్తం ఖరారు... 

జీహెచ్ఎంసి ఎన్నికల్లో బీజేపీ మెరుగైన స్థానాలు గెలుచుకున్న సంగతి తెలిసిందే.  జీహెచ్ఎంసి ఎన్నికల్లో  మెరుగైన ఫలితాలు సాధించడంతో అనేక మంది నేతలు ఆ పార్టీవైపు చూస్తున్నారు.  చాలా రోజులుగా రాములమ్మ బీజేపీలో చేరబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి.  ఆ వార్తలు నిజం కాబోతున్నాయి.  రేపు ఉదయం 11 గంటలకు విజయశాంతి బీజేపీలో చేరబోతున్నది.  ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో సభ్యత్వం తీసుకోబోతున్నారు.  ఇప్పటికే ఢిల్లీ చేరుకున్న విజయశాంతి ఈరోజు సాయంత్రం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలవబోతున్నారు.