నేను కోరుకున్న తెలంగాణ రాలేదు..

నేను కోరుకున్న తెలంగాణ రాలేదు..

తెలంగాణ బిల్లు ఆమోదం పొందిన క్షణం తన జీవితంలో మరచిపోలేనిదని కాంగ్రెస్‌ నేత, సినీ నటి విజయశాంతి అన్నారు. కానీ.. తాను కోరుకున్న తెలంగాణ రాలేదని ఆమె అన్నారు. పథకాలు సరిగ్గా అమలు కావడం లేదని అభిప్రాయపడిన విజయశాంతి.. లోటు బడ్జెట్‌కు ఎందుకు వెళ్లిందో ప్రభుత్వమే చెప్పాలన్నారు. బలహీనవర్గాల ప్రజలు అణచివేతకు గురువుతున్నారని ఆరోపించారు. ప్రశ్నిస్తే జైల్లో పెడుతున్నారని అసహనం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ నేతలపై కేసులతో టీఆర్‌ఎస్‌కే నష్టమని విజయశాంతి అభిప్రాయపడ్డారు.