కేసీఆర్‌ అలా అనుకోవడం దురదృష్టకరం: విజయశాంతి

కేసీఆర్‌ అలా అనుకోవడం దురదృష్టకరం: విజయశాంతి

ఆగస్టు 15 నుంచి అసలైన పాలన మొదలవుతుందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడంపై కాంగ్రెస్‌ నాయకురాలు విజయశాంతి స్పందించారు. ఇంతకాలం తెలంగాణలో అసలు పాలన జరగలేదనే విషయం కేసీఆర్‌ వ్యాఖ్యలతో బయటపడిందని అన్నారు.  కేసీఆర్ వ్యాఖ్యలు వింటుంటే తెలంగాణలో ప్రజాస్వామ్యానికి ఎంతటి దుస్థితి నెలకొందో అర్థమవుతోందని అసహనం వ్యక్తం చేశారు. అధికారం చేతిలో ఉంది కదా అని కేసీఆర్ ఏం చేసినా చెల్లుతుందని అనుకోవడం దురదృష్టకరం అని అన్నారామె.

 కొత్తగా ప్రవేశ పెట్టబోయే మున్సిపల్ చట్టం ద్వారా అక్రమ కట్టడాలను కూలుస్తామని కేసీఆర్‌ చెబుతున్నారని.. అసలు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏది అక్రమమో... సక్రమమో చెప్పలేని అయోమయ పరిస్థితి నెలకొందని విజయశాంతి అన్నారు. 'మూడేళ్లలో అద్భుతం జరగనుందని కేసీఆర్ చెబుతున్నారు. ఆయనకు తెలంగాణ ప్రజల బాధలు ఓ జోక్‌లా అనిపిస్తున్నాయి. విపక్షాల నిరసనలను కూడా జోక్‌గా తీసుకునే కేసీఆర్‌కు చివరికి న్యాయస్థానం ఆదేశాలు కూడా పరిహాసంగానే ఉంటాయి' అని పేర్కొన్నారు విజయశాంతి.