అమిత్‌షాతో విజయశాంతి భేటీ...

అమిత్‌షాతో విజయశాంతి భేటీ...

మాజీ ఎంపీ, సినీనటి విజయశాంతి అలియాస్ వెండి తెర రాములమ్మ.. భారతీయ జనతా పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.. ఇప్పటికే పార్టీలో చేరేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విజయశాంతి... ఇవాళ ఢిల్లీలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో సమావేశం అయ్యారు... ఈ భేటీకి రాష్ట్రానికి చెందిన కీలక నేతలు హాజరయ్యారు... కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డితో పాటు.. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్, పార్టీలో కీలకమైన వ్యక్తి, మాజీ ఎంపీ వివేక్‌ కూడా ఉన్నారు... అమిత్‌షాతో భేటీకంటే ముందు.. కిషన్‌రెడ్డి నివాసంలో భేటీ అయిన విజయశాంతి, బండి సంజయ్, వివేక్... ఆ తర్వాత అంతా కలిసి అమిత్‌షా దగ్గరకు వెళ్లారు. ఇక, అమిత్‌షాతో భేటీతో ఎలాంటి చర్చ జరిగిందనే విషయం తెలియాల్సి ఉండగా... సోమవారం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో కమలం పార్టీ కండువా కప్పుకోనున్నారు విజయశాంతి... అప్పుడే పార్టీ  సభ్యత్వాన్ని కూడా స్వీకరించనున్నారు.. 1998లో మహిళా మోర్చా కార్యదర్శిగా బీజేపీలో రాజకీయ ప్రవేశం చేసిన విజయశాంతి... దాదాపు 22 ఏళ్ల తర్వాత ఆమె తిరిగి బీజేపీ గూటికి చేరుకుంటున్నారు... ఇక, మధ్యలో టీఆర్ఎస్‌లో చేరి ఎంపీగా విజయం సాధించిన ఆమె.. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు.. జనరల్ ఎన్నికల తర్వాత సైలెంట్‌గా ఉన్న ఆమె.. ఆ తర్వాత బీజేపీ నేతల వరుస భేటీలతో ఆ పార్టీ వైపు అడుగులు వేసిన సంగతి తెలిసిందే.