కేశినేని మళ్లీ ట్వీటారు..!

కేశినేని మళ్లీ ట్వీటారు..!

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, విజయవాడ ఎంపీ కేశినేని నాని ట్వీట్ల (తిట్ల) పురాణం మాత్రం ఆగడం లేదు.. ఆ పార్టీ.. ఈ పార్టీ అనే తేడా లేకుండా సోషల్ మీడియాలో దుమ్ముదులిపేస్తున్నారు నాని. ఆయన దెబ్బకు అవతివాళ్లు స్పందించడం మానుకుంటున్నారు తప్పితే.. ఆయన మాత్రం వదలడం లేదు. ఇవాళ ఉదయమే మరో సంచలన ట్వీట్ చేశారు ఎంపీ కేశినేని నాని.. "తాత డబ్బు తో సోకు చేసే వాళ్ళతో దేశానికి నష్టం లేదు.. బ్యాంకుల డబ్బుతో సోకు చేసే వాళ్ళతోనే దేశానికి నష్టం.. నిస్సానిలవల్ల దేశానికి వచ్చిన ప్రమాదం లేదు.. దుష్ట మేధావుల వల్ల మాత్రం దేశానికి పెను ప్రమాదం.. లాగు రంగు వల్ల సమాజానికి ఇబ్బంది లేదు.. మనసు, మధి మలినం కాకుండా వుంటే సమాజానికి మంచిది" అంటూ ట్వీట్ చేశారు. కాగా, విజయవాడ లోక్‌సభ స్థానం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున బరిలోకి దిగి ఓటమిపాలైన పీవీపీ.. విజయం సాధించిన కేశినేని నాని మధ్య గత కొంతకాలంగా సోషల్ మీడియాలో వార్ నడుస్తోన్న సంగతి తెలిసిందే. అయితే, నిన్న "తాతల సొమ్ముతో సోకులు చేసే వేలిముద్ర గాడిని కాదు. వేల కోట్లతో వ్యాపారాలు చేసి వేలాది ఉద్యోగాలు సృష్టించాము. వేల కోట్లు బ్యాంకులకు ఎగొట్టడమెలాగో మీ "గురువు"గారిని  అడిగి చెపితే మేము ఆ కొత్త బిజినెస్ నేర్చుకుంటాము.."