ఐపీఎల్ బెట్టింగ్ ముఠా అరెస్ట్

ఐపీఎల్ బెట్టింగ్ ముఠా అరెస్ట్

ఐపీఎల్ మ్యాచ్ లకు బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠాను అరెస్ట్ చేశారు విజయవాడ పోలీసులు.. వీరంతా ఆన్‌లైన్ బెట్టింగ్‌కు పాల్పడుతున్నారని పోలీసులు తెలిపారు. ఓ ఇంటిని అద్దెకు తీసుకుని క్రికెట్ మజా యాప్ ద్వారా బెట్టింగ్ కార్యకలాపాలు కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు. పెనమలూరు పీఎస్ మురళినగర్‌లో వారి నుంచి రూ.7.50 లక్షల, 20 మొబైల్ కనెక్షన్ కలిగిన కమ్యూనికేటర్ బాక్స్, ల్యాప్‌టాప్, 13 మొబైల్స్ స్వాధీనం చేసుకొని.. విజయవాడ, గుంటూరు జిల్లాలకు చెందిన 9 మంది యువకులను రిమాండ్ లోకి తీసుకున్నారు.