'దేవదాస్' లాంటి కథలో నాగ చైతన్య !

'దేవదాస్' లాంటి కథలో నాగ చైతన్య !

 

నాగ చైతన్యతో ఒక సినిమా చేయాలనుందని, అతని కోసం మంచి ప్రేమ కథ ఒకటి రాస్తునని, మంచి దర్శకుడు దొరికితే సినిమా చేస్తామని స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ గతంలో పలుసార్లు చెప్పిన సంగతి తెలిసిందే.  ఆయన చెప్పినట్టే ఆయన కథను సిద్ధం చేసేశారట.  అది ఒకప్పుడు ఏఎన్నార్ చేసిన 'దేవదాస్' సినిమా తరహాలో ఉంటుందని, ఇప్పటి యువతకు బాగా కనెక్ట్ అవుతుందని విజయేంద్ర ప్రసాద్ అంటున్నారు.  అయితే సినిమా ఎప్పుడు మొదలవుతుంది, దర్శకుడు ఎవరు అనే విషయాల్ని మాత్రం ఇంకా రహస్యంగానే ఉంచారు.  ఇకపోతే చైతన్య ప్రస్తుతం సమంతతో కలిసి  'మజిలీ' అనే సినిమా చేస్తున్నాడు.