80 దేశాల్లో 'సర్కార్' విడుదల !

 80 దేశాల్లో 'సర్కార్' విడుదల !

స్టార్ హీరో విజయ్ నటించిన 'సర్కార్' చిత్రం దీపావళి కానుకగా నవంబర్ 6వ తేదీన విడుదలకానున్న సంగతి తెలిసిందే.  ఇండియా కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న సుమారు 80 ఇతర దేశాల్లో 1200 స్క్రీన్లలో ఈ సినిమా రిలీజ్ కానుంది.  ఇప్పటి వరకు విజయ్ సినిమా ఇంత భారీ స్థాయిలో విడుదలకావడం ఇదే మొదటిసారి.  

అంతేకాదు తమిళ చిత్రాలు అతి తక్కువగా విడుదలయ్యే మెక్సికో, పోలాండ్, ఉక్రెయిన్, రష్యా వంటి దేశాల్లో సైతం ఈ చిత్రం రిలీజ్ అవుతుండటం విశేషం.  మురుగదాస్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ సంస్థ భారీ బడ్జెట్ వెచ్చించి నిర్మించింది.  ఇందులో విజయ్ సరసన కథానాయకిగా కీర్తి సురేష్ అలరించనుంది.