విజయ్ దేవరకొండ సినిమా మళ్ళీ వెనక్కి ?

విజయ్ దేవరకొండ సినిమా మళ్ళీ వెనక్కి ?

'గీత గోవిందం'తో హీరోగా నిలదొక్కుకున్న విజయ్ దేవరకొండ మంచి ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నాడు.  దాదాపు 100 కోట్ల గ్రాస్ తో 'గీత గోవిందం' సక్సెస్ అవగా ఆయన తర్వాతి చిత్రం 'టాక్సీవాలా' కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.  నిజానికి 'టాక్సీవాలా' 'గీత గోవిందం' కంటే ముందే రిలీజవ్వాల్సి ఉండగా విఎఫ్ఎక్స్ ఆలస్యం కావడంతో వాయిదాపడింది. 

తాజా వార్తల ప్రకారం ఇంకా గ్రాఫిక్స్ వర్క్ పూర్తికానందున ఈ ప్రాజెక్ట్ మరింత ఆలస్యమయ్యేలా ఉందని తెలుస్తోంది.  దీంతో ప్రస్తుతం ఆయన చేస్తున్న ద్విభాషా చిత్రం 'నోటా' ముందుకొస్తుందట.  ఆనంద్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో దేవరకొండకు జోడీగా మెహ్రీన్ కౌర్ నటిస్తోంది.