'పూజ'తో మొదలైన విజయ్ సినిమా షూటింగ్!

'పూజ'తో మొదలైన విజయ్ సినిమా షూటింగ్!

దళపతి విజయ్ 65వ చిత్రం పూజా కార్యక్రమాలతో చెన్నయ్ లోని ఘనంగా మొదలైంది. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది. దాదాపు ఎనిమిదేళ్ళ తర్వాత పూజా హెగ్డే ఈ మూవీతో మరోసారి కోలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ఈ రోజు ఉదయం సన్ టీవీ స్టూడియోస్ లో జరిగిన పూజా కార్యక్రమాలలో విజయ్ పాల్గొని క్లాప్ కొట్టి సినిమాను ప్రారంభించారు. రేపటి నుండీ ఈ సినిమార ఎగ్యులర్ షూటింగ్ మొదలు కాబోతోంది. మనోజ్ పరమహంస ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈ యేడాది సంక్రాంతి కానుకగా వచ్చిన విజయ్ 'మాస్టర్' మూవీ ఘన విజయం సాధించిన నేపథ్యంలో ఈ తాజా చిత్రాన్ని కూడా శరవేగంతో పూర్తి చేసి, ఈ యేడాది దీపావళి కానుకగా లేదా వచ్చే యేడాది పొంగల్ కు విడుదల చేయాలన్నది నిర్మాతల ఆలోచన!