పవన్‌పై విజయసాయిరెడ్డి ట్వీట్‌

పవన్‌పై విజయసాయిరెడ్డి ట్వీట్‌

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌పై వైసీపీ నేత విజయసాయిరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 'దొంగతో కలిసిపోయాడు. కాపలా కుక్కలా మారాడు' అంటూ తీవ్ర విమర్శలు చేశారు. ఈమేరకు ఇవాళ ఆయన ట్వీట్‌ చేశారు. 'నిటారుగా, నిక్కచ్చిగా నిలబడాల్సిన ప్రశ్న... మోచేతి నీళ్లు తాగేందుకు అడ్డంగా వంగి పోయింది. ప్రశ్నిస్తా అని వచ్చిన వ్యక్తి లాలూచీ పడ్డాడు. పోలీసులాగా వ్యవహరించాల్సిన వాడు దొంగతో కలిసి పోయాడు.  దోపిడీ సొమ్ముకు కాపలా కుక్కలా మారాడు. ప్రజలు వదుల్తారా? దుడ్డు కర్రలతో వెంటపడ్డారు' అంటూ పోస్ట్‌ పెట్టారు. 

ఇక.. చంద్రబాబు.. ఆయన అనుబంధ పార్టీలు దేనికైనా తెగించడానికి సిద్ధమయ్యరన్న విజయసాయి... ఓటమి తప్పదని అర్థమైనందుకు హింసాత్మక దాడులకు తెగించే ప్రమాదం ఉందన్నారు. ఎన్నికలను వాయిదా వేయించే ప్రయత్నం చేస్తారని.. సహనంతో దాడులను అడ్డుకోవాలని.. ప్రజలకు అండగా నిలబడాలని సూచించారు.