'స్థానిక' ఎన్నికలపై వైసీపీ ఫోకస్‌

'స్థానిక' ఎన్నికలపై వైసీపీ ఫోకస్‌

అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో సీట్లు గెలుచుకున్న వైసీపీ.. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలపై ఫోకస్‌ పెట్టింది. త్వరలోనే ఈ ఎన్నికలు జరగబోతున్నందున పార్టీ శ్రేణులకు దిశనిర్దేశం చేయాలని నిర్ణయించిన అధిష్టానం.. నియోజకవర్గ, మండల స్థాయిల నేతలతో భేటీలకు సమాయత్తమవుతోంది. ఇందులో భాగంగా ఇవాళ అమరావతిలో  నియోజకవర్గ, మండల స్థాయి నేతలతో సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఈ కార్యక్రమానికి హాజరవబోతున్నారు. మునిసిపల్, స్థానిక సంస్థలు, పంచాయతీ ఎన్నికలకు పార్టీ శ్రేణులు సమాయత్తమయ్యేలా ఆయన దిశనిర్దేశం చేయనున్నారు.