నేచురల్ గ్యాస్ కి ఎల్పీజీ కి మధ్య తేడా కూడా తెలియదా? లోకేష్ పై విజయ్ సాయిరెడ్డి సెటైర్ 

నేచురల్ గ్యాస్ కి ఎల్పీజీ కి మధ్య తేడా కూడా తెలియదా? లోకేష్ పై విజయ్ సాయిరెడ్డి సెటైర్ 

వైఎస్సార్‌ సీపీ నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి టీడీపీ నేత నారా లోకేష్‌ బాబుపై సెటైర్లు వేశారు. ఎల్పీజీ విషయంలో లోకేష్‌ చేస్తున్న దుష్ప్రచారాన్ని తప్పుబట్టారు. ఆదివారం ఆయన ట్విటర్‌ వేదికగా స్పందిస్తూ.."లోకేశం..నేచురల్ గ్యాస్ కి ఎల్పీజీ కి మధ్య తేడా కూడా తెలియదా? నేచరుల్ గ్యాస్ వ్యాట్‌లో మార్పులు జరిగితే ఎల్పీజీ పై అని దుష్ప్రచారం చేయిస్తావా?అసలు ఎల్పీజీపై ట్యాక్స్ రాష్ట్రం పరిధిలోకి వస్తుందా?ఇంత అజ్ఞానం పెట్టుకొని మళ్ళీ ఎడిటోరియల్స్ రాస్తున్నట్లు బిల్డప్. లోకం నవ్వుతుంది పప్పు." అంటూ విజయసాయిరెడ్డి ఫైర్ అయ్యారు. కాగా.. సహజవాయువుపై వ్యాట్ పన్ను పెంచుతూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 14.5 శాతం నుంచి 24.5 శాతానికి విలువ ఆధారిత పన్నును పెంచుతూ నోటిఫికేషన్ జారీ చేసింది ఏపీ వాణిజ్య పన్నుల శాఖ.