లోకేష్‌పై విజయసాయిరెడ్డి ఆసక్తికర ట్వీట్‌

లోకేష్‌పై విజయసాయిరెడ్డి ఆసక్తికర ట్వీట్‌

అసెంబ్లీ ఎన్నికల్లో మంగళగిరి నుంచి పోటీ చేసిన మాజీ మంత్రి నారా లోకేష్‌కు ఓటమి తప్పదని టీడీపీకి ముందే తెలుసని వైసీపీ జాతీయ కార్యదర్శి విజయసాయిరెడ్డి అన్నారు. అందుకే లోకేష్‌ చేత ఎమ్మెల్సీ స్థానానికి రాజీనామా చేయాలేదని పేర్కొన్నారు. ఈ మేరకు ఇవాళ ఆయన ట్వీట్‌ చేశారు. ఎన్నికలకు ముందే తమ వాళ్ళకు పోస్టింగులు, ప్రయోషన్లు ఇచ్చారని ఆరోపించారు. అప్పులు తెచ్చి మరీ కాంట్రాక్టర్ల బిల్లులు చెల్లించారని,  ఇప్పుడేమో ఓటమికి కారణాలు తెలియట్లేదంటూ డ్రామాలాడుతున్నారని విమర్శించారు.