ఎన్నికల బరిలో బాక్సర్‌.. కాంగ్రెస్‌ నుంచి పోటీ 

ఎన్నికల బరిలో బాక్సర్‌.. కాంగ్రెస్‌ నుంచి పోటీ 

ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి మాజీ క్రికెటర్‌ గౌతం గంభీర్‌ దిగుతుండగా.. ఇప్పుడు మరో క్రీడాకారుడు సై అంటున్నాడు. ఒలింపిక్‌ పతక విజేత, ప్రముఖ బాక్సర్‌ విజేందర్‌ సింగ్‌ కాంగ్రెస్‌ తరఫున ఎంపీ పోటీ చేయబోతున్నారు. దక్షిణ ఢిల్లీ లోక్‌సభ స్థానం నుంచి విజేందర్‌ పోటీ చేస్తారని కాంగ్రెస్‌ ప్రకటించింది. ఎన్నికల్లో పోటీ చేస్తున్నందున విజేందర్‌.. తన డీఎస్పీ పదవికి కూడా రాజీనామా చేశారు. బాక్సింగ్‌ ద్వారా 20 ఏళ్లుగా దేశం తరఫున ప్రాతినిధ్యం వహించానని.. ఇప్పుడు మరో రూపంలో దేశ సేవ చేసే అవకాశం లభించడం ఆనందంగా ఉందని విజేందర్‌ ట్వీట్‌ చేశారు.