'విక్రమ్ ల్యాండర్‌'పై ఇస్రో కీలక ప్రకటన

'విక్రమ్ ల్యాండర్‌'పై ఇస్రో కీలక ప్రకటన

చంద్రయాన్ 2లో కీలకమైన 'విక్రమ్ ల్యాండర్' చివరి క్షణాల్లో అంతరాయం కలిగించినా.. ఆ తర్వాత విక్రమ్ ల్యాండర్ జాడ దొరికిందని శుభవార్త వినిపించిన ఇస్రో.. ఇప్పుడు.. దానికి సంబంధించిన మరో తిపికబురు చెప్పింది. చంద్రుడిపై హార్డ్ ల్యాండింగ్ చేసిన విక్రమ్ తాజా పరిస్థితిపై ఓ ప్రకటన చేసిన ఇస్రో... విక్రమ్ ల్యాండర్‌కు ఏమీ కాలేదు.. ముక్కలవ్వలేదని గుడ్‌న్యూస్ చెప్పింది. ప్ర‌జ్ఞాన్ రోవర్ ల్యాండర్‌ లోపలే ఉందన్న ఇస్త్రో.. అయితే, ఇది, నిర్దేశిత ల్యాండింగ్ ప్రాంతానికి కొద్ది దూరంలో ఓ పక్కకి ఒరిగిపోయినట్టు పేర్కొంది. కాగా, విక్రమ్ ల్యాండర్‌ను గుర్తించినప్పటి నుంచి దానితో కమ్యూనికేషన్‌ పునరుద్ధరణ కోసం ఇస్త్రో శాస్త్రవేత్తలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయితే, విక్రమ్ ల్యాండర్ ముక్కలు కాకపోయినా.. ఓ పక్కకు ఒరిగి ఉండటంతో.. మరి ఇస్రో ప్రయత్నాలు ఎంత వరకు ప్రయత్నిస్తాయన్నది వేచిచూడాల్సిన అంశమే.