విక్రమ్.. ఇక మిస్టర్ కెకె

విక్రమ్.. ఇక మిస్టర్ కెకె

అపరిచితుడు తరువాత విక్రమ్ కు అలాంటి హిట్ దక్కలేదు.  దీంతో విక్రమ్ ఇబ్బందులు పడుతున్నాడు.  హిట్ కొట్టాలని కసితో సినిమాలు చేస్తున్నా ఉపయోగం లేకుండా పోతున్నది.  ప్రస్తుతం చియాన్ విక్రమ్ తమిళంలో కడరం కొండెన్ సినిమా చేస్తున్నారు.  ఈ సినిమాను తెలుగులో మిస్టర్ కెకె గా డబ్బింగ్ చేస్తున్నారు.  దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్ ను ఈరోజు రిలీజ్ చేశారు.  

కల్ట్ లుక్ లో మాసిన గడ్డంతో విక్రమ్ సూపర్ స్టైలిష్ గా ఉన్నారు.  పక్కా యాక్షన్ ఎంటర్టైనర్ గా మూవీని తెరకెక్కిస్తున్నారు.   కమల్ హాసన్ నిర్మిస్తున్న ఈ మూవీలో అక్షరా హాసన్ హీరోయిన్ గా చేస్తున్నది.  దీపావళిని టార్గెట్ చేసిన ఈ మూవీ ట్రైలర్ ఈరోజు సాయంత్రం రిలీజ్ కాబోతున్నది.  మరి ట్రైలర్ ఎలా ఉంటుందో తెలియాలంటే సాయంత్రం వరకు ఆగాల్సిందే.