చమటలు పట్టిస్తున్న కోబ్రా టీజర్

చమటలు పట్టిస్తున్న కోబ్రా టీజర్

తమిళ స్టార్ హీరో చియాన్ విక్రమ్‌కు తెలుగు నాట కూడా మంచి మార్కెట్ ఉంది. విక్రమ్ సినిమా అంటే చాలా మంది ఎదురుచూస్తుంటారు. ప్రస్తుతం విక్రమ్ ఓ థ్రిల్లర్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు కోబ్రా పేరును పెట్టారు. ఇందులో విక్రమ్ మాథమెటిక్స్ జీనియస్ పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమాలో భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పథాన్ కూడా ఓ ప్రధాన పాత్రలో కనిపించనున్నాడు. ఇందులో ప్రపంచంలో ఏ సమస్యకైనా మాథమెటికల్ లేదా లాజికల్‌గా కానీ సమాధానం కచ్చితంగా ఉంటుందని అంటుంటాడు. అటువంటిది ఓ బిజినెస్ దిగ్గజం కారణంగా పెద్ద సమస్యలో చిక్కుకుంటాడు. అందులో నుంచి ఎలా బయటపడ్డానేది కథ. అయితే టీజర్ మాత్రం ఎంతో గొప్పగా తయారు చేశారు. ఈ సినిమా డిమాంటీ కాలనీ దర్శకుడు అజయ్ జ్ఞానముత్తు డైరెక్షన్‌లో తెరకెక్కతోంది. అంతేకాకుండా ఇందులో కేజీఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా చేస్తోంది. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇందులో ఇర్ఫాన్ పథాన్ కూడా అద్భుతంగా నటించాడు.