విక్రమ్ మరో ప్రయోగం చేస్తున్నారా ?

విక్రమ్ మరో ప్రయోగం చేస్తున్నారా ?

విలక్షణ నటుడు విక్రమ్ మరోసారి ప్రయోగం చేయనున్నారా అంటే అవుననే అంటున్నాయి కోలీవుడ్ వర్గాలు.  తాజాగా ఆయన కొత్త సినిమాను ప్రకటించడం జరిగింది.  ఈ చిత్రాన్ని అజయ్ జ్ఞానముత్తు డైరెక్ట్ చేయనున్నాడు.  ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తే ఏదో కామిక్ పజిల్ చూసినట్టే ఉంది.  విక్రమ్ రకరకాల అవతారాల్లో కనిపిస్తున్నారు.  యాక్షన్ ప్రధానంగా రూపొందుతున్న చిత్రాన్ని సెవెన్ స్క్రీన్ స్టూడియో, వాయకామ్ 18 స్టూడియోలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.  ఈ ఏడాది ఆగష్టు నెలలో మొదలుకానున్న ఈ చిత్రం 2020 ఏప్రిల్ నెలలో విడుదలవుతుందట.