టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సోలిపేటకు చేదు అనుభవం...

టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సోలిపేటకు చేదు అనుభవం...

అసెంబ్లీని రద్దు చేస్తూనే కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించడంతో ప్రచారంలో అధికార పక్షం టీఆర్ఎస్ దూసుకుపోతోంది... అయితే కొన్ని ప్రాంతాల్లో అధికార పార్టీకి చెందిన తాజా మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలకు చేదు అనుభవం ఎదురవుతోంది. తాజాగా సిద్దిపేటలో ప్రచారం నిర్వహిస్తున్న టీఆర్ఎస్ అభ్యర్థి, తాజా మాజీ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డిని అడ్డుకున్నారు స్థానిక యువకులు... జిల్లాలోని మిరుదొడ్డి మండలం చెప్యాల గ్రామంలో టీఆర్ఎస్ ప్రచారానికి వచ్చిన సోలిపేట రామలింగారెడ్డిని అడ్డుకునే ప్రయత్నం చేసిన స్థానిక యువకలు... గ్రామంలో ఎలాంటి అభివృద్ధి పనులు జరగలేదని నిలదీశారు... దీంతో స్థానిక యువకులు, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య తోపులాట జరిగి... ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. సోలిపేట రామలింగారెడ్డి జోక్యం చేసుకుని సర్దిచెప్పాలని చూసినా స్థానిక యువకులు వాగ్వాదానికి దిగారు.