బరువు తగ్గుతున్న వినాయక్
ఒకప్పుడు స్టార్ హీరోలతో భారీ హిట్లు తీసిన దర్శకుడు వివి.వినాయక్ త్వరలో నటుడిగా మారబోతున్నారు. దిల్ రాజు నిర్మాణంలో రూపొందనున్న సినిమాలో వినాయక్ ప్రధాన పాత్ర చేస్తున్నారు. ఈ సినిమాలో కొంత భాగం ఇప్పుడున్నట్టే కొంచెం లావుగా కనిపించనున్న వినాయక్ ఇంకొంత భగంలో సన్నగా కనిపించాల్సి ఉందట. అందుకే ఆయన షెడ్యూల్ ముగియగానే బరువు తగ్గే పని మొదలుపెడతారని వినికిడి. త్వరలో మొదలుకానున్న ఈ చిత్రాన్ని నరసింహ అనే డైరెక్టర్ రూపొందించనున్నారు. ఈయన గతంలో 'శరభ' అనే సినిమాను డైరెక్ట్ చేశారు.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)