అట్టుడుకుతున్న బెంగాల్‌

అట్టుడుకుతున్న బెంగాల్‌

పశ్చిమ బెంగాల్‌ అట్టుడుకుతోంది. నిన్న బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా ర్యాలీలో ఘర్షణలు జరగడంతో ప్రారంభమైన గొడవలు ఇవాళ తీవ్ర రూపం దాల్చాయి. కోల్‌కతాలో తృణమూల్‌ కాంగ్రెస్‌ - బీజేపీ కార్యకర్తలు ఒకరినొకరు కొట్టుకున్నారు. నిన్న అమిత్‌ షా ర్యాలీలో ఘర్షణల తర్వాత సమీపంలోని మోటార్‌ సైకిళ్లకు నిప్పు పెట్టిన బీజేపీ కార్యకర్తలు.. ప్రముఖ తత్వవేత్త ఈశ్వర చంద్ర విద్యాసాగర్‌ విగ్రహాన్ని కూడా ధ్వంసం చేశారు. ఈ ఘటన తర్వాత కోల్‌కతాలో హింస చెలరేగింది.