రేపు ప్రకటన..! ఎల్లుండి నుంచే అమలు..!

రేపు ప్రకటన..! ఎల్లుండి నుంచే అమలు..!

తిరుమల తిరుపతి దేవస్థానంలో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దుపై కీలక నిర్ణయం తీసుకుంది టీటీడీ. దీనిపై టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఇప్పటికే ప్రకటన చేశారు. త్వరలోనే ఎల్1, ఎల్2, ఎల్3 బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తామన్నారు. కాగా, ఎల్లుండి నుంచే వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దుచేయాలనే నిర్ణయానికి వచ్చారు. బ్రేక్ దర్శనాల రద్దుపై రేపు అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందంటున్నారు. దీంతో ఎల్లుండి నుంచి వీఐపీ బ్రేక్ దర్శనాలకు సంబంధించి కొత్త విధానం అమలులోకి రానుంది. ఇప్పుడు అమలవుతోన్న ఎల్1, ఎల్2, ఎల్3 బ్రేక్ దర్శనం విధానాన్ని రద్దు చేసి... 2012 కంటే ముందున్న విధానాన్ని అమలు చేయనుంది టీటీడీ. కాగా, వీఐపీ బ్రేక్ దర్శనం టికెట్ ద్వారా భక్తులను కులశేఖర పడి వరకు అనుమతిస్తారు. పాత విధానం కారణంగా వీఐపీ బ్రేక్ దర్శనం సమయాన్ని రెండు గంటలకు పరిమితం చేసే అవకాశం ఉందని... మరో గంటను సామాన్య భక్తుల దర్శనానికి కేటాయించవచ్చనే అభిప్రాయంతో ఉంది టీటీడీ.