పాక్ అభిమానిని ఓదార్చిన బాలీవుడ్ నటుడు

పాక్ అభిమానిని ఓదార్చిన బాలీవుడ్ నటుడు

ప్రపంచకప్ లో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచ్ లో టీమిండియా చేతిలో పాకిస్థాన్ చిత్తుగా ఓడించడంపై ఆ జట్టు అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. వరుసగా ఏడో సారి టీమిండియా చేతిలో పాక్ ఓడిపోవడంతో ఓ అభిమాని ఏడ్చాడు. అతడిని చూసిన బాలీవుడ్‌ నటుడు రణ్‌వీర్‌ సింగ్‌ అతన్ని అక్కున చేర్చుకుని ఓదార్చారు. ఆ సమయంలో తీసిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌ గా మారింది. ‘ఊర్కో ఊర్కో.. మరో అవకాశం ఉందిలే. బాధపడకు. పాక్‌ జట్టు ప్రదర్శన బాగుంది. క్రికెటర్లు నిబద్ధతతో ఉన్నారు. మళ్లీ ఫాంలోకి వస్తారు’ అని ఓదారుస్తూ అతనితో సెల్ఫీ దిగారు.