కోహ్లీ మరో అరుదైన రికార్డు..

కోహ్లీ మరో అరుదైన రికార్డు..

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో అరుదైన రికార్డు నెలకొల్పాడు.. మ్యాచ్ ఏదైనా పరుగుల వరద పారిస్తున్న కోహ్లీ... ఐసీసీ ప్రపంచకప్‌లో ఇప్పటి వరకు సెంచరీ చేయలేకపోయినా.. వరుసగా హాఫ్‌ సెంచరీలు నమోదు చేశాడు. ఇక వరల్డ్‌కప్‌లో చివరి లీగ్‌ మ్యాచ్‌లో శ్రీలంకపై 34 పరుగులతో నాటౌట్‌గా నిలిచిన కోహ్లీ మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. వరల్డ్‌కప్‌లో 25 ఇన్సింగ్స్‌ల్లో వెయ్యి పరుగులు (1029) పూర్తి చేసిన మూడో భారత క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు. క్రికెట్‌ లెజెండ్‌ సచిన్‌ తెందూల్కర్‌ 44 ఇన్నింగ్స్‌లో 2,278 పరుగులు చేయగా.. సౌరబ్ గంగూలీ 21 ఇన్నింగ్స్‌లో 1006 పరుగులు చేసి రికార్డు నెలకొల్పాడు. అయితే, నిన్న జరిగిన మ్యాచ్‌లో దాదా రికార్డును బ్రేక్ చేశాడు కోహ్లీ.. సచిన్ రికార్డుకు చేరువవ్వాలంటూ ఇంకా వెయ్యికి పైగా పరుగులు చేయాల్సి ఉంది.