ఆ రికార్డుకు 57 పరుగుల దూరంలో కోహ్లీ..

ఆ రికార్డుకు 57 పరుగుల దూరంలో కోహ్లీ..

ఫార్మాటేదైనా మైదానంలో పరుగుల వరద పారిస్తూ రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తున్న టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ కోసం మరో రికార్డు ఎదురు చూస్తోంది.  ఇప్పటి వరకు 221 ఇన్నింగ్స్‌ల్లో 10943 పరుగులు పూర్తి చేసిన కోహ్లీ.. వన్డేల్లో 11 వేల మార్కుకు కేవలం 57 పరుగుల దూరంలో ఉన్నాడు. ఇప్పటి వరకు వన్డేల్లో 11 వేల పరుగులను ఎనిమిది మంది ఆటగాళ్లు పూర్తి చేశారు. కోహ్లీ ఈ ఫీట్‌ సాధిస్తే 9వ స్థానంలో నిలుస్తాడు. ఇక.. భారత్‌ తరఫున సచిన్‌ టెండూల్కర్‌, సౌరవ్‌ గంగూలీలు 11వేల పరుగుల క్లబ్‌లో ఉన్నారు.