తేలిగ్గా తీసుకోం..

తేలిగ్గా తీసుకోం..

వరల్డ్‌కప్‌లో తొలి మ్యాచ్‌లో సౌతాఫ్రికాతో తలపడేందుకు సిద్ధమవుతోంది టీమిండియా.. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే, సౌతాఫ్రికా జట్టును తేలిగ్గా తీసుకోం అన్నారు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ... సౌతాఫ్రికా-టీమిండియా మ్యాచ్‌పై మీడియాతో మాట్లాడిన ఆయన.. సౌతాఫ్రికా టీమ్ ప్రతిభావంతుల జట్టు. తనదైన రోజున ప్రమాదకర ప్రత్యర్థి. కొత్తవాళ్లు వచ్చినా పటిష్టమైన జట్టే. దక్షిణాఫ్రికాను తేలిగ్గా తీసుకోం. తొలి మ్యాచ్‌కు ముందు సమయం దొరకడం టీమ్‌ఇండియాకు కలిసొచ్చేదే. విరామ సమయంలో చాలా విషయాలు నేర్చుకున్నాం. విజయాలు సాధించిన జట్లు ఏ సమయాల్లో ఎలా ఆడాయో గమినించాం. పరిస్థితులకు తగ్గట్లు తుదిజట్టును ఎంపిక చేసుకునే వెసులుబాటు మాకుంది. ముగ్గురు పేసర్లు లేదా ఇద్దరు స్పిన్నర్లతో బరిలో దిగొచ్చు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోడానికి మేం సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి.