ధోనీపై కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు..

ధోనీపై కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు..

మిస్టర్ కూల్, టీమిండియా మాజీ సారథి ఎంఎస్ ధోనీపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ... ఐసీసీ వరల్డ్ కప్‌లో భాగంగా వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో ధోనీ స్లో బ్యాటింగ్‌పై విమర్శలు వచ్చిన సమయంలో ఆయనకు బాసటగా నిలిచాడు కోహ్లీ. ధోనీ ఆటచూస్తే.. టెస్ట్ మ్యాచ్‌ చూసినట్టుగా ఉందని.. చివరల్లో బాగా ఆడిన మొదట్లో సింగిల్స్‌కే ప్రాధాన్యం ఇచ్చారని.. స్లో బ్యాటింగ్‌తో బోర్ కొట్టించాడని విమర్శలపై స్పందించిన టీమిండియా సారథి... స్లో బ్యాటింగ్‌‌ అనేది పెద్ద విషయం కాదని కొట్టిపారేశాడు. ధోనీ క్రికెట్‌‌ లెజెండ్‌‌ అని కొనియాడిన కోహ్లీ.. ఈ మాజీ సారథి అనుభవం, ఫీడ్‌‌బ్యాక్‌‌ వెలకట్టలేనిదని ప్రశంసలు కురిపించాడు. ‘మిడిల్‌‌లో ఎలా ఆడాలో ధోనీకి బాగా తెలుసు. ఎప్పుడైనా కొద్దిగా బాగా ఆడకపోతే ప్రతి ఒక్కరు అతని గురించే మాట్లాడుతుంటారు. కానీ, మేం పట్టించుకోం.. మా కోసం ఎన్నో మ్యాచ్‌‌లు గెలిపించాడు. అందుకే మా మద్దతు ఎప్పుడూ అతనికే. చివర్‌లో 15, 20 పరుగులు కావాల్సిన సమయంలో ధోనీలాంటి ఆటగాడే కావాలి. వాటిని ఎలా సాధించాలో అతనికి మాత్రమే తెలుసు. అతని అనుభవం వల్ల పది సార్లలో ఎనిమిది సార్లు మాకు మంచే జరిగింది అంటూ విమర్శలను తిప్పికొట్టారు కోహ్లీ.