ఆర్‌సీబీపై ఎక్కవ మంది నమ్మకాలు పెట్టుకోలేదు... కానీ... 

ఆర్‌సీబీపై ఎక్కవ మంది నమ్మకాలు పెట్టుకోలేదు... కానీ... 

తమ జట్టుపై నమ్మకం ఉంచలేదని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ పేర్కొన్నాడు. కానీ ఈ సీజల్ లో జట్టు రాణిస్తోందని, అంచనాలకు మించి రాణిస్తున్నామని కోహ్లీ తెలిపాడు. ‘ మాపై ఆశలు ఎవరూ ఉంచలేదు, కానీ  ఆటగాళ్ళకు గెలవాలనే కోరిక ఎంతగానో ఉంది. దాని వల్లే మేము గెలిచాం. కేకేఆర్ ఇచ్చిన 85 పరుగుల లక్ష్యాన్ని కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి, 39 బంతులు ఉండగానే ముగించాం." అని కెప్టెన్ కోహ్లీ పేర్కొన్న సంగతి తెలిసిందే. నిన్న కోల్ కతా తో జరిగిన మ్యాచ్ లో విజయం సాధించడంతో ఆర్‌సీబీ 14 పాయింట్లతో పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది. కేకేఆర్ ప్రస్తుతం నాలుగో స్థానంలో ఉంది. ఇక ఆటగాళ్ల విషయానికి వస్తే, సిరాజ్ కు కొత్త బంతిని ఇచ్చేందుకు కోహ్లీ ఆలోచించినట్టు తెలిపాడు.  కొత్త బంతిని వాషింగ్టన్ సుందర్ కు ఇవ్వాలని అనుకున్నానని, కానీ, సిరాజ్ ను నమ్మి అతనికి ఇచ్చినట్టు తెలిపాడు.  తాను తన ఆటగాళ్లను నమ్మానని, ప్రపంచంలో గొప్ప ఆటగాళ్లు ఉన్నప్పటికీ నమ్మకం లేకపోతె రాణించలేమని కోహ్లీ పేర్కొన్నాడు.