సల్మాన్, అక్షయ్, అమితాబ్‌ను వెనక్కి నెట్టిన కోహ్లీ..

సల్మాన్, అక్షయ్, అమితాబ్‌ను వెనక్కి నెట్టిన కోహ్లీ..

ఏ ఫార్మాట్ అయినా తన బ్యాట్‌తో పరుగుల వరద పారిస్తున్న టీమిండియా కెప్టెన్... రికార్డుల మోత మోగిస్తున్నాడు... గత రికార్డులను బద్దలు కొడుతూ సరికొత్త రికార్డులు నెలకొల్పుతున్నాడు. ఇక, తాజాగా ఫోర్బ్స్ ఇండియా సెలబ్రిటీ-100 జాబితాలో బాలీవుడ్‌ స్టార్స్‌ను సైతం వెనక్కి నెట్టి టాప్ స్పాట్‌కి చేరాడు టీమిండియా కెప్టెన్. ఈ జాబితాలో కోహ్లీతో పాటు మిస్టర్ కూల ఎంఎస్ ధోనీ, క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ టాప్-10లో చోటు దక్కించుకున్నారు. అత్యధికంగా ఆర్జిస్తోన్న భారత సెలబ్రిటీల జాబితాను తాజాగా విడుదల చేసింది ఫోర్బ్స్ ఇండియా... ఈ జాబితాలో క్రీడావిభాగం నుంచి అందులో క్రికెటర్లే ఎక్కువగా ఉండ‌టం విశేషం. అయితే గ‌త ఏడాది టాప్ 2లో నిలిచిన భార‌త క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఈసారి మరోస్థానం ఎగబాకి టాప్ స్పాట్‌ చేరుకున్నాడు.

గత ఏడాది అక్టోబ‌ర్ 1 నుండి 2019 సెప్టెంబ‌ర్ 30 మ‌ధ్య సెల‌బ్రిటీలు ఆర్జించిన ఆదాయంతో పాటు ఫేమ్ ప‌రంగా ఫోర్బ్స్ ర్యాంకులు ప్రకటించారు. రూ. 252.72 కోట్ల ఆర్జనతో కోహ్లీ తొలి స్థానంలో నిలవగా... త‌ర్వాతి స్థానాల‌లో అక్షయ్ కుమార్, సల్మాన్ ఖాన్, అమితాబ్ బ‌చ్చన్‌, మ‌హేంద్ర సింగ్ ధోనీ, షారూఖ్ ఖాన్, ర‌ణ్‌వీర్ సింగ్‌, అలియా భ‌ట్, సచిన్, దీపికాలు టాప్ 10లో నిలిచారు. సెలబ్రిటీల పేర్లు.. వారి ఆర్జిస్తోన్న మొత్తాన్ని ఓ సారి పరిశీలిస్తే... విరాట్ కోహ్లీ (రూ.252.72కోట్లు), అక్షయ్ కుమార్ (రూ.293.25కోట్లు), స‌ల్మాన్ ఖాన్ (రూ. 229.25 కోట్లు), అమితాబ్ బ‌చ్చ‌న్ (రూ. 239.25 కోట్లు), ఎస్ ధోనీ (రూ. 135.93 కోట్లు), షారూఖ్ ఖాన్ (రూ. 124.38 కోట్లు), ర‌ణ్‌వీర్ సింగ్ (రూ. 118.2 కోట్లు), అలియ భ‌ట్ ( రూ. 59.21 కోట్లు), స‌చిన్ టెండూల్కర్ (రూ. 76.96 కోట్లు), దీపికా ప‌దుకొణే( రూ. 48 కోట్లు)తో టాప్‌ టెన్‌లో నిల్వగా... రూ. 13 కోట్లతో సూపర్ స్టార్ ర‌జనీకాంత్ 13వ స్థానంలో.. మోహన్ లాల్ రూ. 64.5 కోట్లతో 27వ ప్లేస్‌లో, 35 కోట్లతో ప్రభాస్ 44వ స్థానంలో.. రూ. 30 కోట్లతో  విజయ్ 47వ స్థానంలో రూ.35 కోట్లతో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్‌బాబు 54వ స్థానంలో.. రూ.34 కోట్లతో కమల్ హాసన్ 56వ స్థానంలో నిలిచారు.