టీమిండియా క్రికెటర్లు.. కాసేపు సరదాగా..

టీమిండియా క్రికెటర్లు.. కాసేపు సరదాగా..

వరల్డ్‌కప్‌లో టీమిండియా తొలి మ్యాచ్‌ను ఈ నెల 5వ తేదీన సౌతాఫ్రికాతో ఆడనుంది. ఇప్పటికే రెండు వామప్‌ మ్యాచులాడిన భారత క్రికెటర్లు తీవ్రంగా ప్రాక్టీస్‌ చేస్తున్నారు. ప్రాక్టీస్‌ సెషన్స్‌లో పాల్గొంటూనే వీలు చిక్కినప్పుడల్లా వివిధ ప్రాంతాలను సందర్శిస్తూ రిలాక్స్‌ అవుతున్నారు. ఇందులో భాగంగానే నిన్న సాయంత్రం సౌతాంప్టన్‌లో పెయింట్‌ బాలింగ్‌ గేమ్‌ ఆడారు భారత క్రికెటర్లు. కోహ్లితోపాటు ధోని, చహల్‌, రాహుల్‌, ధావన్‌, దీపక్‌ చాహర్‌, బుమ్రా, కుల్దీప్‌, దినేశ్‌ కార్తీక్‌, రోహిత్‌ శర్మ ఇందులో పాల్గొన్నారు.