పిచ్‌ తప్పేమి లేదని చెప్పిన కోహ్లీ, రూట్

పిచ్‌ తప్పేమి లేదని చెప్పిన కోహ్లీ, రూట్

కేవలం రెండు రోజులోనే టెస్ట్ మ్యాచ్ పూర్తి కావడంతో మొతేరా పిచ్‌ పై విమర్శల వర్షం కురుస్తుంది. అయితే పిచ్‌పై వస్తున్న విమర్శల్ని ఖండించాడు టీమ్‌ఇండియా సారథి విరాట్‌ కోహ్లీ.  మొతేరా పిచ్‌ బాగానే ఉందని చెప్పాడు. పింక్‌ టెస్ట్‌ రెండు రోజులో ముగియడానికి పిచ్‌ ఎంతమాత్రం కారణం కాదన్నాడు విరాట్‌. రెండు జట్ల బ్యాట్స్‌మెన్‌ వైఫల్యమే దీనికి కారణమని స్పష్టం చేశాడు. నిజాయతీగా చెప్పాలంటే బ్యాటింగ్‌ నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా లేదనీ... తాము 3 వికెట్లు కోల్పోయి 100 పరుగులు చేశామనీ..  అలాంటిది 150 లోపే తక్కువకే ఆలౌటవడం ఆశ్చర్యాన్ని కలిగిందనీ చెప్పాడు కోహ్లీ. తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌ చేసేందుకు పిచ్‌ బాగానే ఉందన్న విరాట్‌.... 30 వికెట్లలో 21... నేరుగా విసిరిన బంతులకే పడటం విస్మయపరిచిందన్నాడు. తమ డిఫెన్స్‌పై నమ్మకంగా ఉండటమే టెస్టు క్రికెట్లో ప్రధానమన్న కోహ్లీ... సరిగ్గా ఆడటకపోవడంతోనే మ్యాచ్‌ త్వరగా ముగిసిందని వివరణ ఇచ్చాడు. 

అలాగే ఈ విషయం పై ఇంగ్లాండ్‌ సారథి జో రూట్‌ మాట్లాడుతూ... టీమ్‌ ఇండియా చేతిలో ఘోర ఓటమికి పిచ్‌ కారణం కాదని చెప్పాడు. తొలి ఇన్నింగ్స్‌లో లభించిన శుభారంభాన్ని అందిపుచ్చుకోవడం విఫలమయ్యామని చెప్పాడు. నాణ్యమైన బౌలింగ్‌ కారణంగానే.. ఓడిపోయామని అన్నాడు. తాను ఐదు వికెట్లు తీశానంటే అది పిచ్‌ వల్లేనని చెప్పాడు రూట్‌.