సెమీస్‌లో కోహ్లీ X విలియమ్సన్‌.. ఇది రెండోసారి

సెమీస్‌లో కోహ్లీ X విలియమ్సన్‌.. ఇది రెండోసారి

వరల్డ్‌కప్‌ చివరి దశకు చేరుకుంది. మరో రెండ్రోజుల్లో సెమీస్‌లో భారత్‌-న్యూజిలాండ్‌ తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌కు ఓ విశేషం ఉంది. అదేంటంటే.. ఇప్పుడు ఈ రెండు జట్లకూ సారథ్యం వహిస్తున్న విరాట్‌కోహ్లీ, కేన్‌ విలియమ్సన్‌లు గతంలోనూ ప్రపంచకప్‌ సెమీస్‌లో కెప్టెన్లుగా వ్యవహరించారు. 2008 అండర్‌-19 వరల్డ్‌కప్‌లో ఇండియా, న్యూజిలాండ్‌ జట్లు సెమీస్‌లో తలపడగా.. అప్పుడు ఆ రెండు జట్లకూ కోహ్లీ, విలియమ్సన్‌లే కెప్టెన్లు. ఆ మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. కోహ్లీ 43 పరుగులు చేయడమేకాకుండా రెండు వికెట్లు కూడా తీశాడు. మళ్లీ ఇప్పుడు దాదాపు  11ఏళ్ల తర్వాత ప్రపంచకప్‌ సెమీస్‌లో వీరిద్దరూ మరోసారి తలపడుతున్నారు.