రవిశాస్త్రి, కోహ్లీలకు అరుదైన గౌరవం

రవిశాస్త్రి, కోహ్లీలకు అరుదైన గౌరవం

భారత కెప్టెన్ విరాట్‌ కోహ్లీ, కోచ్‌ రవిశాస్త్రికి అరుదైన గౌరవం లభించింది. సిడ్నీ క్రికెట్‌ మైదానం వారిని జీవిత కాల గౌరవ సభ్యులుగా ఎంపిక చేసింది. క్రికెట్‌కు చేసిన సేవలు, సిడ్నీ మైదానంలో చరిత్ర సృష్టించినందుకు వారిని సత్కరించింది. వీరిద్దరినీ మినహాయిస్తే ఇంతకు ముందు దిగ్గజాలు సచిన్‌ తెండుల్కర్‌, బ్రయన్‌ లారాకు మాత్రమే ఈ గౌరవ సభ్యత్వం ఇచ్చింది. విరాట్‌ కోహ్లీతో కలిసి ఎస్‌సీజీ గౌరవ సభ్యత్వం అందుకోవడం చాలా సంతోషకరం, గౌరవం అని రవిశాస్త్రి ట్వీట్‌ చేశాడు.