సిడ్నీ మైదానంలో విరుష్క 'విక్టరీ వాక్‌’

సిడ్నీ మైదానంలో విరుష్క 'విక్టరీ వాక్‌’

నాలుగు టెస్టుల సిరీస్‌ను భారత్‌ 2-1 తేడాతో కైవసం చేసుకోవడంతో అస్ట్రేలియా గడ్డపై భారత్‌ తొలిసారిగా టెస్ట్ సిరీస్ గెలిచింది. సిరీస్ గెలిచిన అనంతరం సిడ్నీ మైదానంలో భారత ఆటగాళ్లు సంబరాలు చేసుకున్నారు. టీం సభ్యులందరూ డాన్స్ చేసి ఆనందంలో మునిగితేలారు. అనంతరం భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ సతీమణి అనుష్క శర్మ మైదానంలోకి వచ్చి తన భర్తను కౌగిలించుకుని 'ఆటపై నీ పట్టుదల, అంకితభావంకు అన్ని సాదించగలవు. చాలా గర్వంగా ఉంది మై లవ్‌' అంటూ అభినందించింది. తరువాత ఇద్దరు కలిసి మాట్లాడుకుంటూ నడిచివెళ్లారు.

మైదానంలో విరుష్క జంట కలిసి నడుచుకుంటూ వెళ్లిన వీడియోను ఓ అభిమాని ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియోపై నెటిజన్లు తమదైన స్టయిల్లో కామెంట్లు పెడుతున్నారు. మైదానంలో ‘విక్టరీ వాక్‌’ చేస్తున్నారంటూ ఓ అభిమాని ట్వీట్ చేసాడు. విన్నింగ్ కపుల్, వెరీ నైస్, హ్యాపీ మూమెంట్స్, ఈ విజయాలను ఇలాగే కొనసాగించు కెప్టెన్ అని అభిమానులు ట్వీట్స్ చేశారు.  

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Winning couple????????????. @virat.kohli @anushkasharma #viratkohli #anushkasharma #virushka #virataddicted

A post shared by Virat Addicted ????????♥️ (@virataddicted.01) on