మళ్లీ టాప్‌స్పాట్‌కి టీమిండియా కెప్టెన్

మళ్లీ టాప్‌స్పాట్‌కి టీమిండియా కెప్టెన్

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మళ్లీ టాప్‌ స్పాకు దూసుకెళ్లాడు.. ఐసీసీ తాజాగా ప్రకటించిన టెస్టు ర్యాంకింగ్స్‌లో 928 పాయింట్లతో నంబర్ వన్‌గా నిలిచాడు కోహ్లీ.. బ్యాటింగ్‌ విభాగంలో గతంలోనూ నంబర్ 1 స్థానానికి చేరుకున్న విరాట్‌ను.. స్టీవ్ స్మిత్‌ వెనక్కి నెట్టగా.. ఈ సారి స్మిత్‌ను వెనక్కి నెట్టి మరోసారి మొదటి స్థానానికి ఎగబాకాడు కోహ్లీ. ఇక, స్మిత్ 923 పాయింట్లతో రెండోస్థానంలో, 877 పాయింట్లతో విలియ‌మ్‌స‌న్‌ మూడో స్థానంలో.. 791 పాయింట్లతో పుజారా నాల్గో స్థానంలో.. 764 పాయింట్లతో డేవిడ్ వార్నర్‌ ఐదో స్థానంలో కొనసాగుతున్నారు. మరోవైపు బౌలింగ్ విభాగంలో ఆస్ట్రేలియా బౌల‌ర్ ప్యాట్ క‌మ్మిన్స్ 900 పాయింట్లతో మొదటి స్థానంలో ఉండగా.. ఆల్ రౌండ‌ర్ జాబితాలో విండీస్ ప్లేయ‌ర్ జేస‌న్ హోల్డర్ 473 పాయింట్ల‌తో ఫస్ట్ ప్లేస్‌లో నిలిచాడు.. ఈ విభాగంలో 406 పాయింట్లతో ర‌వీంద్ర జ‌డేజా రెండో స్థానంలో ఉన్నాడు.