రికార్డులన్నీ బ్రేక్.. ఆ జాబితాలో కోహ్లీయే టాప్..

రికార్డులన్నీ బ్రేక్.. ఆ జాబితాలో కోహ్లీయే టాప్..

పరుగుల యంత్రం, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తన బ్యాట్‌కు పని చెప్పాడంటే ఏదో ఒక రికార్డు బ్రేక్ కావాల్సిందే.. విండీస్‌ టూర్‌లో వరుస సెంచరీలతో కధంతొక్కిన కోహ్లీ... ఓ అరుదైన రికార్డును బ్రేక్ చేశాడు. మూడు వన్డేలో సిరీస్‌లో భాగంగా వెస్టిండీస్‌తో జరిగిన చివరి వన్డేలో 99 బంతుల్లో 114 పరుగులు చేసిన టీమిండియా విజయంలో కీలక పాత్రపోషించగా.. ఈ ఇన్నింగ్స్‌తో ఇప్పటి వరకు ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్‌పై ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు. వన్డే క్రికెట్‌లో పదేళ్లలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు టీమిండియా కెప్టెన్‌.. ఈ దశాబ్దంలో 20,018 పరుగులు బాది.. టాప్‌స్పాట్‌లోకి దూసుకెళ్లాడు. ఇక 18,962 పరుగులతో పాంటింగ్‌ రెండో స్థానంలో ఉండగా.. 16,777 పరుగులతో జాక్వెస్ కలిస్‌ మూడో స్థానంలో.. 16,304 పరుగులతో జయవర్ధనే నాల్గో స్థానంలో.. 15,999 పరుగులతో కుమార సంగక్కర ఐదో స్థానంలో.. 15,962 పరుగులతో సచిన్‌ తెందూల్కర్‌ ఆరో స్థానంలో ఉన్నారు.