కోహ్లీ.. పాక్ అభిమాని కోరికను తీరుస్తాడా..?

కోహ్లీ.. పాక్ అభిమాని కోరికను తీరుస్తాడా..?

టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి దేశంలో లక్షలాది మంది అభిమానులు ఉన్నారు.  కోహ్లీ స్టైలిష్ బ్యాటింగ్ కు ఫిదా అవుతుంటారు.  కోహ్లీ చెలరేగి ఆడుతుంటే.. గ్యాలరీలో ఆటను చూసేవాళ్ళే కాదు.. టీవీల ముందు కూర్చున్న వాళ్ళుసైతం కేరింతలు కొడుతుంటారు.  కోహ్లీకి ఇండియాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు.  పాక్ లో అయితే చెప్పక్కర్లేదు.  పాక్ క్రికెటర్ల కంటే విరాట్ కోహ్లీని అభిమానించే వాళ్ళ సంఖ్య అక్కడ ఎక్కువ.  ఇండియా.. పాకిస్తాన్ జట్లమధ్య మ్యాచ్ జరిగితే ఆ సందడి వేరుగా ఉంటుంది.  

అయితే, ప్రస్తుతం ఇండియా.. పాక్ దేశాల మధ్య జరుగుతున్న గొడవల కారణంగా రెండు దేశాల మధ్య క్రికెట్ మ్యాచ్ లు తక్కువగా జరుగుతున్నాయి.  ఇండియా జట్టు పాక్ లో పార్యటించి చాలా కాలం అయ్యింది.  ధోని మెరుపులు మెరిపించి సమయంలో పాక్ లో పర్యటించింది.  ఆ తరువాత ఇండియా పాక్ లో మ్యాచ్ లు ఆడలేదు.  2011 వరల్డ్ కప్ సమయంలో కూడా ఇండియా పాక్ లో మ్యాచ్ ఆడలేదు.  అయితే, ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి షాబాజ్ షరీఫ్ అనే అభిమాని తన మనసులోని మాటను ప్లకార్డు రూపంలో ప్రదర్శించారు.  కోహ్లీ పాక్ రావాలని, పాక్ లో క్రికెట్ ఆడాలని పేర్కొన్నాడు.  పాక్ - శ్రీలంక జట్లమధ్య లాహోర్ లో జరిగిన మ్యాచ్ సమయంలో ఆ అభిమాని ఈ ప్లకార్డు ను ప్రదర్శించాడు.  ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.