చెలరేగిన కోహ్లీ...డబుల్ సెంచరీతో మరో రికార్డు బద్దలు

చెలరేగిన కోహ్లీ...డబుల్ సెంచరీతో మరో రికార్డు బద్దలు

దక్షిణాఫ్రికాతో పూణేలో జరుగుతున్న రెండో టెస్టులో దక్షిణాఫ్రికా బౌలర్లను టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఊచకోత కోశాడనే చెప్పాలి. సఫారీ బౌలర్లపై విరుచుకుపడుతూ స్టేడియం నలువైపులా చూడముచ్చటైన షాట్లు కొడుతూ, టెస్ట్ కెరీర్ లో ఏడవ డబుల్ సెంచరీని నమోదు చేశాడు. మొత్తం 295 బంతులను ఎదుర్కొన్న కోహ్లీ 200 పరుగుల మైలురాయిని అందుకున్నాడు. ఈ క్రమంలో 28 బౌండరీలు చేశాడు కోహ్లీ. అయితే 211 పరుగులు చేసినా ఇందులో ఒకే ఒక్క సిక్సర్ ఉండడం గమనార్హం.

ఇదే సమయంలో తన టెస్ట్ కెరీర్ లో కోహ్లీ 7వేల పరుగులను పూర్తి చేసుకున్నాడు. మరో ఎండ్ లో కోహ్లీకి అండగా రవీంద్ర జడేజా 39 పరుగులతో క్రీజులో ఉన్నాడు. ప్రస్తుతం భారత్ స్కోరు 4 వికెట్ల నష్టానికి 506 పరుగులు. అంతకు ముందు 59 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రహానే ఔట్ అయ్యాడు. దక్షిణాఫ్రికా బౌలర్లలో రబాడా మూడు వికెట్లు తీయగా, మహరాజ్ ఒక్క వికెట్ తీశాడు. మరో పక్క ఆస్త్రేలియన దిగ్గజ ఆటగాడు బ్రాడ్ మ్యాన్ రికార్డును కోహ్లీ బద్దలు కొట్టాడు. కెప్టెన్ గా ఉంటూనే అత్యాధిక 150 పరుగులు చేసిన రికార్డు బ్రాడ్ మ్యాన్ పేరిట ఉండేది. ఈరోజు మ్యాచ్ తో కోహ్లీ ఆయన రికార్డు బద్దలు కొట్టాడు.