ధోనీ రికార్డు బద్దలు కొట్టిన కోహ్లీ 

ధోనీ రికార్డు బద్దలు కొట్టిన కోహ్లీ 

రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా కింగ్స్‌స్టన్‌లో జరిగిన రెండో టెస్టులో భారత్ ఘన విజయం సాధించి టెస్టు సిరీస్‌ను 2-0తో క్లీన్ స్వీప్ చేసింది. 468 పరుగుల లక్ష్య ఛేదనతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన  విండీస్ 210 పరుగులకే కుప్పకూలి 257 పరుగుల భారీ తేడాతో పరాజయం పాలైంది. విండీస్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ను 3-0తో, మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను 2-0తో, ఇప్పుడు రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను 2-0తో సొంతం చేసుకున్న కోహ్లీ సేన విండీస్ పర్యటనను విజయవంతంగా ముగించింది. ఇక విండీస్‌ టెస్ట్ సిరీస్ విజయంతో కెప్టెన్ విరాట్ కోహ్లీ పలు రికార్డులను సృష్టించాడు, మరి కొన్నిటిని బద్దలు కొట్టాడు. 48 టెస్టుల్లో 28 మ్యాచ్‌లను గెలిచిన విరాట్ భారత్ తరుపున అత్యదిక టెస్ట్‌ విజయాలు నమోదు చేసిన కెప్టెన్‌ గా ధోనీ గతంలో క్రియేట్ చేసిన రికార్డును బద్దలు కొట్టాడు. అంతకముందు మిస్టర్ కూల్ ధోని 60 టెస్ట్ మ్యాచ్‌లకు కెప్టెన్‌గా జట్టుకు ప్రాతినిధ్యం వహించగా 27 విజయాలను నమోదు చేశాడు. ఇప్పుడు ధోనిని కోహ్లీ అధిగమించి టెస్ట్‌లో మోస్ట్‌ సక్సెస్‌పుల్ ఇండియన్‌ కెప్టెన్‌గా రికార్డు సృష్టించాడు. ఇక అదే పర్యటనలో మూడు ఫార్మాట్లలో అన్ని మ్యాచ్‌లతో పాటు సిరీస్‌లను గెలిచి కూడా మరో అరుదైన ఘనతను విరాట్ సొంత చేసుకున్నాడు.