కోహ్లీ మరో ప్రపంచ రికార్డు

కోహ్లీ మరో ప్రపంచ రికార్డు

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. మాంచెస్టెర్ లో వెస్టిండీస్ తో జరుగుతున్న మ్యాచ్ ద్వారా కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ లో 20 వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. ఈ మ్యాచ్‌లో 37 పరుగులు చేసి 20 వేల పరుగుల మార్కును కోహ్లీ అందుకున్నాడు. తక్కువ ఇన్నింగ్స్‌లో ఈ మైలురాయిని చేరుకున్న తొలి ఆటగాడిగా విరాట్ కోహ్లీ రికార్డు సృష్టించాడు.

ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌లో ఎక్కువ పరుగులు చేసిన వారిలో భారత్ నుంచి సచిన్ టెండుల్కర్, రాహుల్ ద్రవిడ్ ఉన్నారు. వీళ్ల తర్వాత ఇప్పుడు మూడో వ్యక్తిగా విరాట్ కోహ్లీ రికార్డు సాధించాడు. సచిన్ టెండుల్కర్ 34,357 పరుగులు చేయగా... రాహుల్ ద్రవిడ్ 24,208 పరుగులు చేశాడు. ప్రపంచం మొత్తం మీద ఈ రికార్డు సాధించిన 12 వ ఆటగాడిగా కోహ్లీ చరిత్ర సృష్టించాడు. కోహ్లీ ఇప్పటి వరకు 417 ఇన్నింగ్స్ ఆడగా... టెస్టుల్లో 131, వన్డేల్లో 224, టీ20ల్లో 62 ఇన్నింగ్స్ ఆడాడు.