మూడు రికార్డులు బద్దలు కొట్టిన కోహ్లీ..

మూడు రికార్డులు బద్దలు కొట్టిన కోహ్లీ..

వెస్టిండీస్‌తో జరిగిన రెండో వన్డేలో సెంచరీతో చెలరేగిపోయిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.. ఒకే మ్యాచ్‌లో మూడు రికార్డులను బ్రేక్ చేశాడు.. వన్డే ఫార్మాట్‌లో టీమిండియా తరఫున అత్యధిక పరుగులు (238 వన్డేల్లో 11,406) సాధించిన రెండో ఆటగాడిగా రికార్డు సృష్టించిన కోహ్లీ... 311 వన్డేల్లో 11,363 పరుగులు చేసిన మాజీ కెప్టెన్ సౌరవ్‌ గంగూలీ రికార్డును బ్రేక్ చేశాడు. మొత్తంగా కోహ్లీ ఎనిమిదో స్థానంలో ఉండగా.. మాస్టర్ బ్లాస్టర్ సచిన్‌ టెండూల్కర్ 463 వన్డేల్లో 18,426 పరుగులతో టాప్ స్పాట్‌లో కొనసాగుతున్నాడు. ఇక, విండీస్‌పై అత్యధిక పరుగులు చేసిన మరో రికార్డు నెలకొల్పాడు టీమిండియా కెప్టెన్. 64 ఇన్సింగ్స్‌లు ఆడిన 2032 పరుగులు చేసిన ఆటగాడిగా పాక్‌ మాజీ కెప్టెన్‌ జావెద్‌ మియాందాద్‌ పేరుతో ఉన్న మరో రికార్డును బద్దలుకొట్టేశాడు. 26 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టాడు. కేవలం 35 ఇన్నింగ్స్‌లోనే ఆ రికార్డును బ్రేక్ చేయడం ద్వారా ఓ జట్టుపై అత్యంత వేగంగా 2వేలకు పైగా పరుగులు చేసిన తొలి ఆటగాడిగా రికార్డులకెక్కాడు. మరోవైపు ఈ రెండు దేశాల మధ్య కరీబియన్‌లో జరిగిన వన్డే సిరీస్‌లో మూడు సెంచరీలు చేసిన ఏకైక ఆటగాడిగా నిలిచిన విరాట్ కోహ్లీ... రెండు సెంచరీలు చేసిన డెస్మండ్‌ హేన్స్‌ రికార్డును అధిగమించాడు.