మేమిద్దరం మేఘాల్లో తేలిపోయాం...

మేమిద్దరం మేఘాల్లో తేలిపోయాం...

భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ ఇటీవలే ఓ శుభవార్త అందించిన విషయం తెలిసిందే. తాను తల్లి కాబోతున్నట్లు అనుష్క భర్త విరాట్ తో కలిసి ఉన్న ఓ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. ఇప్పుడు మేము ముగ్గురం కాబోతున్నాము అని ట్విట్ చేసారు. తండ్రి కాబోతున్న ఆ అనుభూతిని తాజాగా మరోసారి అభిమానులతో పంచుకున్నాడు విరాట్ కోహ్లీ. అదో అనిర్వచనీయమైన అనుభూతి, నా ఆనందం మాటల్లో చెప్పలేనిది. ఆ విషయం తెలిసాక మేమిద్దరం మేఘాల్లో తేలిపోయాం. ఈ వార్తను అభిమానులతో పంచుకున్నాక వారు మాపై చూపించిన ప్రేమ వెలకట్టలేనిది. మా మధ్యలోకి రాబోతున్న మూడోవ్యక్తి రాకకోసం ఎదురుచూస్తున్నం అని కోహ్లీ పేర్కొన్నాడు. అయితే కరోనా వైరస్ కారణంగా విధించిన లాక్ డౌన్ ను పూర్తిగా ఎంజాయ్ చేసానని కోహ్లీ అన్నాడు. తన భార్యతో కలిసి అంత సమయం కలిసి ఉండటం ఇదే తొలిసారి అని చెప్పాడు. లాక్ డౌన్ లో నేను అనుష్క కలిసి ఇంట్లోనే ఉన్నాము. నిజం చెప్పాలంటే మా పరిచయం అయినప్పటినుండి అన్ని రోజులు కలిసి ఉన్నది ఇదే తొలిసారి, ఎప్పుడు అలాంటి అవకాశం మాకు కలిసి రాలేదు. కాబట్టి లాక్ డౌన్ లో మేమిద్దరం మంచి సమయాన్ని గడిపాము అని కోహ్లీ తెలిపాడు.